‘పీపుల్స్‌ మార్చ్‌’కు మూడేళ్లు .. | - | Sakshi
Sakshi News home page

‘పీపుల్స్‌ మార్చ్‌’కు మూడేళ్లు ..

Apr 6 2026 8:06 AM | Updated on Apr 6 2026 8:06 AM

ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నాడు ప్రతిపక్ష నేత హోదాలో మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్‌ పేరిట పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి బజార్‌హత్నూర్‌ మండలం పిప్రి గ్రామం నుంచి 2023 మార్చి 16న శ్రీకారం చుట్టారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి వివిధ వర్గాల వారిని కలిశారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మాణిక్‌రావ్‌ ఠాక్రేతో పాటు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న పలు వురు కాంగ్రెస్‌ నేతలు ఆయనతో కలిసి అడుగు కలిపారు. తాజాగా భట్టి నాటి పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. ‘అణ గారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పాదయాత్ర చేపట్టానని.. ఇది రాష్ట్ర ప్రజలతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరిచిందని.. ఆదిలాబా ద్‌ అడవుల నుంచి ఖమ్మం గడ్డ వరకు 1,364 కిలోమీటర్ల ప్రయా ణం నా జీవితంలో మర్చిపోలేని ఒక మహాయజ్ఞమని’ పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ పాదయాత్రను ప్రజా ఉద్యమంగా మార్చిన ప్రతీ కార్యకర్తకు, నాయకుడికి, అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement