బోథ్: వ్యవసాయ క్షేత్రాలు ఏ రకమైన పంటలకు అ నుకూలంగా ఉంటాయి.. నేలలో పోషకాల స్థాయి ఎలా ఉంది.. ఎలాంటి ఎరువులు ఏ సందర్భాల్లో ఉ పయోగించాలనే విషయాలపై రైతులకు అవగా హ న కలగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి.సరైన సమయంలో వర్షాలు పడకపోవడం అలాగే ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఏటా నష్టపోతున్నారు. ఈ క్రమంలో భూసార పరీక్షలు నిర్వహించి తదనుగు ణంగా పంటలు సాగుచేస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
జిల్లాలో..
జిల్లాలో 101 క్లస్టర్లుఉన్నాయి. వాటి పరిధిలో దాదా పు 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ఏటా వర్షాకాలం, యాసంగిలో పత్తి, సొయా, పెసర, మినుము, జొన్న, మొక్క జొన్న, శనగ, కంది తదితర పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఎరువులు ఎంత మోతాదులో వాడాలి.. భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉందో తెలియక సరైన దిగుబడి రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
అవగాహన లేమితో వెనుకంజ
రైతులు ఇష్టానుసారం రసాయన ఎరువుల వాడకంతో సాగు వ్యయం పెరగడంతో పాటు భూమిలో పోషక విలువలు తగ్గుతున్నాయి. నేల స్వభావం తెలియక అవసరానికి మించి క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. భూసార పరీక్షల ప్రాధాన్యంపై సదస్సులు, సమావేశాల్లో వ్యవసాయాధికారులు, సిబ్బంది పదేపదే చెబుతున్నా రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని తెలుస్తోంది.
ఫలితాల ఆధారంగా..
భూసార పరీక్ష ఫలితాలు అనుసరించి సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఈ పరీక్ష ల ద్వారా నేలలోని ఉదజని, లవణ సూచి క పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ లభ్యత ను తెలుసుకోవచ్చు. తద్వారా అవసరమైన మోతా దులో ఎరువుల వినియోగానికి అవకాశం ఉంటుంది.
గ్రామానికి పది మట్టి నమూనాల సేకరణ..
ప్రజాపాలన–ప్రగతి ప్రఽణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రెవెన్యూ గ్రామాల వారీగా కనీసం పది మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నమూనాలను భూసార పరీక్ష కేంద్రాలకు పంపించి మే 10 లోపు ఫలితాలను అందించాలని ప్రభుత్వం పేర్కొంది. కాగా జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలు సేకరించే పనుల్లో ఉన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
రైతులు భూసార పరీక్షలు ఏటా చేయించుకోవాలి. తద్వారా నేలకు కావాల్సిన పోషకాలను ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. ఆయా క్లస్టర్లలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులను లేదా నేరుగా వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలి. ఈ పరీక్షలు పూర్తిగా ఉచితం. వారం రోజుల్లో రిపోర్టులు వస్తాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయాధికారి


