కై లాస్‌నగర్: బుద్ధ పౌర్ణమిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ బౌద్ధ మహాసభ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షాను ఆదివారం ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రపంచానికే శాంతి సందేశాన్ని ఇచ్చిన గౌతమ బుద్ధుని జయంతిని సెలవుదినంగా ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది బౌద్ధులు ఉన్నారని వారి ఆకాంక్షలను గౌరవించేలా పిప్రికి రానున్న సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞాకుమార్, విట్టల్, దయానంద్, దయానంద్ కాంబ్లే, రాహుల్ పాల్గొన్నారు.


