ఆదిలాబాద్‌రూరల్: మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో ఆదివారం జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష అతిథులుగా పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉప ప్రధానిగా జగ్జీవన్‌రామ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంతకముందు ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా దళిత అభివృద్ధి శాఖ అధికారి సునీత కుమారి, కార్పొరేషన్ ఈడీ మనోహర్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీవైఎస్‌వో శ్రీనివాస్, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


