జగన్‌ హయాంలో జిల్లాల పునర్విభజన | - | Sakshi
Sakshi News home page

జగన్‌ హయాంలో జిల్లాల పునర్విభజన

Mar 25 2026 6:54 AM | Updated on Mar 25 2026 6:54 AM

వైఎస్సార్‌సీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 2023లో జిల్లాల పునర్విభజన చేపట్టారు. పార్లమెంటు స్థానం ఒక జిల్లాగా తూర్పుగోదావరి, కాకినాడ, అమలాపురం జిల్లాలు ఏర్పాటు చేశారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేయగా ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లాగా చేసింది. ఇదిలా ఉండగా జగన్‌ హయాంలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాలోకి కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు కలిశాయి. ఇలా ఏడేసి నియోజకవర్గాలతో ఒక జిల్లాను జగన్‌ ఏర్పాటు చేశారు. పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంతో కలిపి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 22 అసెంబ్లీ స్థానాలు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement