ఆలోచనకు సృజన తోడైతే.. పనికికాని పుల్లలతోనూ అద్భుత కళాఖండాలు తయారు చేయవచ్చు.. అందరితో ఔరా అనిపించుకోవచ్చు. రాజానగరం మండలం వెలుగుబంద జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు బి.పవన్‌కుమార్ సారథ్యంలో విద్యార్థులు పనికిరాని వస్తువులతో వివిధ బొమ్మలను తీర్చిదిద్దారు. పారేసిన ఐస్‌క్రీం పుల్లలు, స్ట్రాలతోపాటు అగ్గి పుల్లలు, ధారం, అట్టముక్కలను ఉపయోగించి అందమైన బొమ్మలను చేసి అబ్బురపరిచారు. ‘నో కాస్ట్, నో లాస్’ విధానంలో బోధనోపకరణాలను కూడా రూపొందించవచ్చని పవన్‌కుమార్ అన్నారు. పాఠశాలలో ప్రతి శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా అమలు చేస్తున్న తరుణంలో విద్యార్థులచే ఇటువంటివి తయారు చేయించడం ద్వారా సృజనాత్మకతను వెలికితీయవచ్చని అంటున్నారు. –రాజానగరం


