దారులన్నీ వేలాల వైపే.. | - | Sakshi
Sakshi News home page

దారులన్నీ వేలాల వైపే..

Feb 17 2026 7:36 AM | Updated on Feb 17 2026 7:36 AM

దారుల

దారులన్నీ వేలాల వైపే..

● రెండోరోజూ కొనసాగిన జాతర ● అధికసంఖ్యలో వచ్చిన భక్తులు

జైపూర్‌: మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేలాల జాతరకు రెండోరోజు సోమవారం కూడా భక్తులు పోటెత్తారు. దీంతో వేలాల పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివ నామస్మరణతో జాతర అంతా మార్మోగింది. ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ మూడురోజుల పాటు ని ర్వహించే జాతరలో భాగంగా తొలి రోజు ఆదివారం భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించా రు. గట్టు మల్లన్న సన్నిధికి చేరుకుని దొణలో స్వయంభువుగా వెలిసిన మల్లన్నస్వామికి బోనాలు పోశారు. పసుపు, కుంకుమ, పచ్చ, కుడుక, రవిక, త్రిశూలం, గజ్జెల లాగులతో పట్టు వస్త్రాలు పరిచి ఒగ్గు పూజారులతో పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రంతా జాగారం చేశారు. సోమవారం మళ్లీ గోదావరి నదిలో స్నానాలాచరించి మల్లికార్జునస్వామి దర్శనానికి క్యూకట్టారు. తెలంగాణతోపాటు మహారా ష్ట్ర, సిరోంచా, గడ్చిరోలి ప్రాంతాల నుంచి వేలాది గా భక్తులు తరలిరాగా ఆలయం కిటకిలాడింది. ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలు కాగా, దివ్యదర్శనం కో సం సుమారు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. శివసత్తుల పూనకాలు, లక్ష్మీదేవరుల ప్ర దర్శనలు, ఒగ్గు పూజారుల ఢమరుక మోతలతో వేలాల జాతర పరిసరాలు మార్మోగాయి.

సందడి సందడిగా జాతర

రెండోరోజు గుట్ట కింద వేలాలలో జాతర రాత్రి హోరెత్తింది. ఆయా ప్రాంతాల్లో భక్తులు, యువతీయువకులు జాతర చూడడానికి అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రధాన ఆర్చీ రోడ్డు నుంచి గోదావరి నది తీరం వరకు రోడ్డుకు ఇరువైపులా షాపులు ఏర్పాటు చేశారు. రాత్రి నుంచి ఉదయం వరకు భక్తులు పిల్లాపాపలతో షాపింగ్‌ చేస్తూ బిజీబిజీగా గడిపారు.

భారీ పోలీస్‌ బందోబస్తు

వేలాల జాతరలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, జైపూర్‌ సీఐ నవీన్‌కుమార్‌, ఎస్సై రాజశేఖర్‌ నేతృత్వంలో 500మంది పోలీస్‌ సిబ్బందితో ప్రధాన ఆలయం, గోదావరి నది, పార్కింగ్‌, ప్రధాన ఆలయ ఆర్చీ రోడ్డు, బస్టాండ్‌, వేర్వేరు ఐదు రూట్లగా పోలీసులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించారు. 50కి పైగా సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల నిఘాలో జాతర సాగింది.

దారులన్నీ వేలాల వైపే..1
1/3

దారులన్నీ వేలాల వైపే..

దారులన్నీ వేలాల వైపే..2
2/3

దారులన్నీ వేలాల వైపే..

దారులన్నీ వేలాల వైపే..3
3/3

దారులన్నీ వేలాల వైపే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement