ఉత్కంఠ విజయం
ఒక్క ఓటుతో
గట్టెక్కిన సత్తన్న
నార్నూర్ మండలంలోని ఖైర్‌దాట్వ పంచాయతీలో కనక సత్యనాయణ, మాడావి జైవంత్‌రావు సర్పంచ్‌గా పోటీ చేశా రు. సత్యనారాయణకు 113 ఓట్లు రాగా, జైవంత్‌రావుకు 112 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటే ఒకరిని అందలం ఎక్కించి విజేతగా నిలిపింది.
అదృష్టం.. నర్వటే వైపే
ఇచ్చోడ మండలం దాబా (బి) పంచాయతీ సర్పంచ్‌గా నర్వటే ఈశ్వర్‌ను అదృష్టం వరించింది. ఈ పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్‌గా కేటాయించగా నర్వటే ఈశ్వర్, మా నే రామేశ్వర్, సింధుబాయి బరిలో నిలిచారు. మొత్తం 494 ఓట్లు ఉండగా 434 పోలయ్యాయి. నర్వటే రామేశ్వర్‌కు 176, మానే రామేశ్వర్‌కు 176 ఓట్లు సమంగా రాగా, మరో అభ్యర్థి సింధుబాయికి 104 ఓట్లు, 8 చెల్లని ఓట్లు పోల య్యాయి. ఎన్నికల అధికారులు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయగా.. నర్వటే రామేశ్వర్‌ను సర్పంచ్ గిరి దక్కింది. ఇక్కడ చెల్లని ఓట్లు గెలుపోటముల్లో కీలకంగా మారినట్లు తెలుస్తోంది.
ఉత్కంఠ విజయం


