● ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం ● మందు, విందులతో ఓ
కై లాస్‌నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల రెండో వి డత ప్రచార పర్వం ముగిసింది. ఈ విడతలో జిల్లాలోని ఆదిలాబాద్‌రూరల్, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరజ్, తాంసి, భీంపూర్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అనుచరులతో కలిసి వారం పాటు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ము గియడంతో ఆయా పల్లెలన్నీ సైలెంట్‌గా మారాయి. మరోవైపు ప్రలోభాలు షురూ అయ్యాయి. ఓటర్లకు మందు, విందులు ఏర్పాటు చేసే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. పోలింగ్‌కు ఒకరోజు సమయం ఉండడంతో పోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.
డిసెంబర్ 6న..
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 30న వెలువడింది. ఆ రోజు నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించారు. 3న పరిశీలన చేపట్టి అర్హులైన అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచి న అభ్యర్థులకు ఈనెల 6న గుర్తులు కేటాయించా రు. దీంతో వారు ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వారం పాటు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ప్రలోభాలకు ఎర..
ప్రచారం ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. ప్రతీ ఓటరును వ్యక్తిగతంగా కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. డబ్బులు, మద్యం పంపిణీ చేపడుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు పంచుతున్నారు. మరోవైపు మద్యం పంపకాలు, విందులు జోరందుకున్నాయి. శనివారం ఒక్కరోజే సమయం ఉండటం, తెల్లవారితే పోలింగ్ ఉండనుండడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఓ టర్లను పూర్తిస్థాయిలో ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా యువతకు గాలం వేసేందుకు ప్రత్యేకంగా విందులు ఏర్పాటు చేస్తున్నారు.
రెండో విడతలో..
ఎన్నికలు జరిగే మండలాలు 8
గ్రామపంచాయతీలు 156
వార్డు స్థానాలు 1,260


