ఎన్నికల నియమావళి పాటించాలి
తాంసి: ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని వడ్డాడి గ్రామంలో ఓటర్లతో శుక్రవారం మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా ఉండకూడదని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే 100 డయల్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. అ లాగే ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీ లకు అనుమతి లేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మూడో విడత ఎన్నికలు పూర్తి అయిన తరువాత అనుమతితో ర్యాలీలు చేసుకోవాలని తెలిపారు. ఇందులో రూరల్ సీఐ ఫణిందర్, స్థానిక ఎస్సై జీవన్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
లాండసాంగ్విలో..
ఆదిలాబాద్‌రూరల్: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలో ని లాండసాంగ్వి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో ఎస్పీ పా ల్గొని మాట్లాడారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.


