జట్టు విజయంలో కీలకం
రాథోడ్ రవీందర్–కవిత దంపతుల కుమారుడు ప్రదీప్ ఇప్పటివరకు రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. డిసెంబర్ 6 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 టోర్నీలో జట్టు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. గతంలో మహారాష్ట్రలోని సతారాలో నిర్వహించిన జూనియర్ నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడు. 2024లో యూపీలోని అయోధ్యలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ 17 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. మేడ్చల్ వేదికగా నిర్వహించిన జూనియర్ రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో, మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొని మెప్పించాడు. నిజామాబాద్‌లో నిర్వహించిన 42వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో, పటాన్‌చెరులో నిర్వహించిన జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలోనూ ఆడియువ క్రీడాకారులకు ఆదర్శంగా
నిలుస్తున్నాడు.
రాథోడ్ ప్రదీప్


