జాతీయ జట్టుకు సారథిగా..
సునీల్–నవనీత దంపతు ల కుమారుడు రాథోడ్ ఆ కాష్ ప్రస్తుతం కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. 2024లో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నిర్వహించి న జూనియర్ నేషనల్ మీట్‌లో పాల్గొన్నాడు. మేడ్చల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయస్థానం కై వసం చేసుకో గా, అందులో కీలకంగా వ్యవహరించాడు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. నవంబర్ 28 నుంచి 30 వరకు పటాన్‌చెరులో నిర్వహించిన 44వ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించాడు. నవంబర్ 8 నుంచి 10 వరకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈనెల 25 నుంచి 30 వరకు జరగనున్న జాతీయస్థాయి పోటీలకు సారధిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఉట్నూరులో నేషనల్ క్యాంపులో శిక్షణ పొందుతున్నాడు.
రాథోడ్ ఆకాష్


