నేషనల్ క్యాంపునకు ఎంపిక
ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ) చదువుతున్న సంపత్ నాయక్ చిన్న వయసులోనే గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు. 2022లో మహారాష్ట్రలోని నాసిక్ వేదికగా నిర్వహించిన అండర్ 17 ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీల్లో, 2024లో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నిర్వహించిన జూనియర్ నేషనల్ ఈవెంట్‌లోనూ మెరిశాడు. నవంబర్ 8 నుంచి 10 వరకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఔరా అనిపించాడు. కర్ణాటకలోని దావనగెరెలో నిర్వహించిన సౌత్ జోన్ సీనియర్ నేషనల్ మీట్‌కు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అత్యుత్తమంగా రాణించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. వరంగల్‌లోని కాజీపేటలో 2026 జనవరిలో నిర్వహించనున్న పోటీల్లోరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం సీనియర్ జాతీయ జట్టు క్యాంపులో శిక్షణ తీసుకుంటున్నాడు.
సంపత్ నాయక్


