హోంగార్డుల సేవలు కీలకం
ఆదిలాబాద్ టౌన్: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. 63వ హోంగార్డు రైజింగ్‌డేను పురస్కరించుకుని శనివారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పరేడ్ కమాండర్ భూమన్న ఆధ్వర్యంలో మహిళా సిబ్బందితో కూడిన మూడు ఫ్లాటూన్ల జిల్లా హోంగార్డు బృందం పరేడ్ నిర్వహించి ఎస్పీకి గౌరవవందనం చేశారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16మంది హోంగార్డులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఉలెన్ జాకెట్లు, రెయిన్‌కోట్లు అందజేశారు. విధి నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు వెంకటి, మురళి, శ్రీకాంత్, హోంగార్డ్ ఆర్‌ఐ చంద్రశేఖర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు రాకేశ్, గబ్బర్‌సింగ్, ఆశన్న, హోంగార్డు సిబ్బంది సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసినా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటనలో హెచ్చరించా రు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. జిల్లా అంతటా 30పోలీస్ యాక్ట్ అమలు లో ఉందని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు.
ఎన్నికల్లో గొడవలు వద్దు
బోథ్: పంచాయతీ ఎన్నికలు ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా నిర్వహించేలా నాయకులు, గ్రామస్తులు సహకరించాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ సూచించారు. శనివారం సొనాల, బోథ్ మండల కేంద్రాలతోపాటు మండలంలోని కౌఠ బీ, కనుగుట్ట, ధన్నూర్ బీ గ్రామాల్లో శనివారం సా యంత్రం పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాల ను పరిశీలించారు. ఎన్నికలను వేలం ద్వారా దక్కించుకోవడం చట్టరీత్య నేరమని హెచ్చరించారు. చట్టాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని సూచించారు. ఏదైన సమస్య ఉంటే ‘డయల్ 100’కు ఫోన్ చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి, బోథ్ సీఐ గురుస్వామి, బోథ్ ఎస్సై శ్రీసాయి, బజార్‌హత్నూర్ ఎస్సై సంజయ్‌కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


