టూరిజం అభివృద్ధికి చర్యలు
ఆదిలాబాద్ టౌన్: అటవీ సంపద వృద్ధి, టూరి జం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ట్లు రాష్ట్ర అడిషనల్ పీసీసీఎఫ్ రత్నాకర్ జోహా రి తెలిపారు. అటవీ ప్రాంతాలను పరి శీలించేందుకు జిల్లాలో పర్యటించిన ఆయన శనివా రం అటవీశాఖ గెస్ట్ హౌస్‌లో మీడియాతో మా ట్లాడారు. కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ పరి ధిలో టైగ ర్ జోన్ ఏర్పాటుకు పలు గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు. పులుల సంరక్షణ, ఎకో టూరి జాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నా రు. అటవీ ప్రాంతంలో లక్కను ప్రోత్సహిస్తూ స్థానికులు ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అటవీ సరిహద్దుల రక్షణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. బాసర జోన్‌లోని కవ్వాల్ టైగర్ అభివృద్ధికి ఇన్‌చార్జీగా తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అటవీ ప్రాంతంలో పులుల రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. డీఎఫ్వో ప్రఽశాంత్ బాజీరావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.


