‘సీఎంను ఎందుకు పొగుడుతున్నవ్’
ఆదిలాబాద్ టౌన్: రాష్ట్ర బీజేపీ నేతలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే, ఎమ్మె ల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్‌రెడ్డిని ఎందుకు పొగుడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ప్రశ్నించా రు. ఎమ్మెల్యే వైఖరిని బీజేపీ నేతలే విమర్శిస్తున్నారని ఆరోపించారు. శనివారం స్థానిక బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఎమ్మెల్యే తనపై చేసిన వ్యాఖ్యలు ఖండించారు. హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించి ఢిల్లీలో పైరవీలు చేస్తున్న విషయాన్ని ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ శ్రేణులతో చ ర్చించారని, ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరనే విష యం ఆ పార్టీ నేతలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పరిశ్రమలు స్థాపించి యువతకు ఉ ద్యోగాలిప్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రస్తుతం పరిశ్రమను ప్రైవేట్ పరం చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్ర శ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ కౌ న్సిలర్లు, స్థానిక నేతలను ఎమ్మెల్యే నయవంచనకు గురి చేశారని ఆరోపించారు. పార్టీ కార్యాలయ నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారని, కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేశారని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలున్నారు.


