● సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తుల ఆదర్శం ● నిత్యం ప్రజలత
సాక్షి, ఆదిలాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్ని కల్లో జిల్లాలో ఇప్పటికే పలువురు సర్పంచులు, వా ర్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రత్యేకత చాటారు. ఆ గ్రామ అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ ఆదర్శంగా ముందుకు కదిలారు. నిత్యం ప్రజ లతో మమేకమై ఉండే వ్యక్తులు, సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారం చూపే చొరవ ఉన్నవారిని కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన వారికి అండగా నిలుస్తూ ఈసారి ఏకగ్రీవంగా ఎన్నుకుని వారిని అందలమెక్కించారు. ఓ పంచా యతీ పరిధిలో అనుబంధ గ్రామాలుండగా, గతంలో ఓ గ్రామానికి సర్పంచ్ పదవి కట్టబెట్టిన గ్రామస్తులు.. ప్రస్తుతం మరో గ్రామానికి పదవి అప్పగి స్తూ ఒప్పందం ప్రకారం నడుచుకున్నారు. దీంతో రెండు గ్రామాల్లో అభివృద్ధి సమపాళ్లలో జరగనుండడంతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదటి విడతలో 33 స్థానాలు..
మొదటివిడతలో ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏకగ్రీవ సర్పంచుల స్పష్టత వచ్చింది. మొదటి విడతలో 33 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నా ర్నూర్ మండలంలో ఆరు, ఇచ్చోడలో ఐదు, గాది గూడలో నాలుగు, ఇంద్రవెల్లిలో నాలుగు, సిరికొండలో ఏడు, ఉట్నూర్ మండలంలో ఏడు సర్పంచ్ సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అప్పుడు అటు.. ఇప్పుడు ఇటు
ఇచ్చోడ మండలం దేవుల్‌నాయక్ తండా సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా రాథోడ్ లలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కిందటి ఎన్నికల్లో రాథోడ్ లలిత ఎన్నికల్లో పోటీ చేసి రాథోడ్ భీంబాయి చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. గ్రామస్తులు మాత్రం ఈసారి ఆమైపె నమ్మకం చూపెడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా ప్రత్యేకత చాటారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోయిన ఆమైపె ఆదరణ చూపెట్టడం ద్వారా గ్రామస్తులు విలువలు కలిగిన రాజకీయాలను చాటారు.
ముచ్చటగా మూడోసారి..
అప్పుడు ఓడిపోవడంతో..
గ్రామ రాజకీయాల్లో ఇదో ఔన్నత్యం. సాధారణంగా మనకు దగ్గరగా నివసించే వ్యక్తి సమస్యలు పరిష్కారిస్తారని, ఇక్కడే అభివృద్ధి పనులు చేపడతారని జనాలు నమ్మకం పెట్టుకుని ఆదరించడం చూస్తుంటాం. గతంలో గ్రామంలో ఒక వైపు నివసించే వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకుంటే ఆ సమయంలోనే వచ్చే ఎన్నికల్లో మరోవైపు నుంచి వ్యక్తిని ఆదరిస్తామని ఒప్పందం చేసుకోవడం, దానికి అనుగుణంగా మాట నిలుపుకొని ఈ ఎన్నికల్లో ఆచరించడం గ్రామస్తులకే సాధ్యం. అలాంటిదే ఈ ఏకగ్రీవాలకు నిదర్శనం. ఇంద్రవెల్లి మండలం గట్టెపల్లి సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా సర్పంచ్‌గా ఈసారి ఆత్రం అనితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమె ఆ గ్రామంలోని అనుబంధ గ్రామమైన చింతగూడకు చెందిన మహిళ. కిందటి సారి గట్టెపల్లికి చెందిన కుమ్ర మోహన్‌ను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం మరోవైపు నివసించే వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. సమక గ్రామపంచాయతీ ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, సర్పంచ్‌గా ఈసారి కుమ్ర రాజేశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో సమకకు చెందిన సోయం రంభబాయిని సర్పంచ్‌గా ఎన్నుకోగా, అప్పుడే మరోవైపు ఉండే పాఠగూడకు చెందిన వారికి అవకాశం కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నారు. దానికి అనుగుణంగా ముందుకు కదిలారు. గ్రామంలో ఈ ఆదర్శ రాజకీయాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
● సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తుల ఆదర్శం ● నిత్యం ప్రజలత
● సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తుల ఆదర్శం ● నిత్యం ప్రజలత
● సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తుల ఆదర్శం ● నిత్యం ప్రజలత
● సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తుల ఆదర్శం ● నిత్యం ప్రజలత


