ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
కైలాస్‌నగర్: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతా రణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ ఎన్నికల సూక్ష్మ పరిశీలకులు, జోనల్ అధి కారులకు శిక్షణ ఇవ్వగా కలెక్టర్ హాజరై మాట్లాడా రు. సూక్ష్మ పరిశీలకులు పంచాయతీ పరిధిలోని వా ర్డులను పరిశీలించాలని తెలిపారు. 28కాలం ప్రొఫా ర్మాను విధిగా నింపాలని, పోల్ డే రోజు వివరాలు ఎప్పటికప్పుడు తెలుపాలని సూచించారు. జోనల్ అధికారులకు 9నుంచి 10పోలింగ్ కేంద్రాలు కేటా యించనున్నట్లు తెలిపారు. తన పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ పక్కాగా అమలు జరిగేలా చూడాలని సూచించారు. ఎస్‌ఎస్‌టీ, ఎ ఫ్‌ఎస్‌టీ బృందాలతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను కలిసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని తెలిపారు. ఫొటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, అభ్యర్థులు ఖర్చుల వివరా లు సంబంధిత అధికారులకు పంపేలా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు వెంకన్న, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా శిక్షణ నోడల్ అధికా రి మనోహర్, డీపీవో రమేశ్, డీఎల్పీవో ఫణీందర్‌రావు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులున్నారు.
ఎన్నికలు పూర్తయ్యేదాకా నియమావళి
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచినవారు విజయోత్సవ ర్యాలీలు, ప బ్లిక్ మీటింగులు నిర్వహించరాదని తెలిపారు. ప్రకటనలు, అభివృద్ధి హామీలు చేయరాదని పేర్కొన్నా రు. ఇలాంటి చర్యలను తక్షణమే నిరోధించాలని రి టర్నింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపా రు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గమనిస్తే వెంట నే సంబంధిత ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు మండలాల విధుల కేటాయింపునకు జెడ్పీ సమావేశ మందిరంలో రెండో విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎన్నికల సాధారణ పరిశీలకుడు వెంకన్న ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు.
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
ఆదిలాబాద్‌రూరల్: అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సాంఘిక సంక్షేమ కార్యాలయ ఆవరణలో అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటం, విగ్రహాలతోపాటు మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌రావు, దళితాభివృద్ధి శాఖ అధికారి సునీతాకుమారి తదితరులున్నారు.


