సోయా కొనుగోళ్లు ప్రారంభించాలి
బేల: సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని గురువా రం మండల కేంద్రంలోని మార్కెట్ సబ్‌యార్డులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఠాక్రే గంభీర్ మాట్లాడుతూ.. 15రోజుల క్రితమే సోయా కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభి స్తారో ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని డిమాండ్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న డిప్యూటీ తహసీల్దార్ వామన్‌రావు ఫోన్‌లో మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌తో మాట్లాడించారు. వచ్చే సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ప్రమోద్‌రెడ్డి, నాయకులు సతీశ్‌పవార్, తేజ్‌రావు, గుండవార్ ఆకాశ్, జితేందర్, బత్తుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.


