మరింత ఊరట | - | Sakshi
Sakshi News home page

మరింత ఊరట

Oct 24 2025 7:28 AM | Updated on Oct 24 2025 7:28 AM

మరింత ఊరట

మరింత ఊరట

● ‘ఇందిరమ్మ’ ఇళ్లకు మరుగుదొడ్లు ● రూ.12వేలు ఇవ్వనున్న ఎస్‌బీఎం ● ఇరుకు స్థలమున్న పట్టణవాసులకు జీ+1 తరహా నిర్మాణాలకూ చాన్స్‌

కై లాస్‌నగర్‌: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడం, మేసీ్త్రలు, నిర్మాణ కూలీల కొరత లేకుండా శ్రద్ధ వహిస్తోంది. తాజాగా వారికి మరింత ప్రయోజనం చేకూర్చేలా వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (ఎస్‌బీఎం) ద్వారా రూ.12వేల ఆర్థి క సాయాన్ని అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. స్లాబ్‌ లెవెల్‌, స్లాబ్‌ నిర్మాణం పూర్తి చేసిన ఉపాధిహా మీ జాబ్‌ కార్డు కలిగిన లబ్ధిదారులకే ఈ సాయం అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు అర్హు ల ఎంపికపై దృష్టి సారించారు. ఇప్పటివరకు 600 మంది లబ్ధిదారుల వివరాలను ఎస్‌బీఎం అధికారులకు అందజేశారు. ఆ వివరాలను పరిశీలిస్తున్న సదరు అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాల అంచనాలను సిద్ధం చేసి నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాలోని 1,338 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు తొలివిడతగా ప్రయోజనం చేకూరనుంది.

పట్టణ పేదలకు మరింత లబ్ధి

పట్టణాల్లో 400 చదరపు అడుగులలోపు స్థలం కలిగిన పేదలూ జీ ప్లస్‌ వన్‌ విధానంలో నిర్మించుకునేలా ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 500 నుంచి 600 చదరపు అడుగుల సొంత స్థలాన్ని కలి గిన పేదలకు మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు ఆ దిశగానే అమలు చేసింది. ఈ విధానంలో రెండు గదులతో పాటు వంటగది మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకో వాలని స్పష్టం చేసింది. ఇంటి నిర్మాణ డిజైన్‌కు హౌసింగ్‌ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు అనుమతి తప్పనిసరి చేసింది. అయితే గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణా నికి రూ.లక్ష, రూఫ్‌ లెవెల్‌కు రూ.లక్ష, ఫస్ట్‌ ఫ్లోర్‌ ని ర్మాణానికి రూ.రెండు లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ సంచాలకుడు గౌతమ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లబ్ధిదా రుల ఎంపికపై మున్సిపల్‌, హౌసింగ్‌ శాఖల అధికా రులు దృష్టి సారించారు. త్వరలోనే అర్హులను ఎంపిక చేసి ఇళ్లు మంజూరు చేయనున్నారు.

జిల్లాలో ఇళ్ల నిర్మాణాల సమాచారం

మంజూరైన ఇళ్లు 15,486

పునాది దశలో.. 7,763

బేస్మెంట్‌ దశలో.. 4,547

రూఫ్‌ లెవెల్‌లో.. 1,092

రూఫ్‌ పూర్తయినవి 236

పూర్తయిన ఇళ్లు 2

నిర్మాణాలు ప్రారంభించనవి 5,877

ఎస్టిమేషన్లు సిద్ధం చేస్తున్నాం

ఇందిరమ్మ లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటివరకు 600 మంది లబ్ధిదారుల వివరాలను హౌసింగ్‌ శాఖ అధికారులు మాకు పంపించారు. జాబ్‌ కార్డు కలిగిన ఇందిరమ్మ లబ్ధిదారుల మరుగుదొడ్డికి సంబంధించి ఎస్టిమేషన్లు సిద్ధం చేస్తున్నాం. ప్రక్రియ పూర్తయ్యాక వారి ఖాతాల్లో రూ.12వేలు జమ చేస్తాం.

– ఫర్హాత్‌, ఎస్‌బీఎం జిల్లా మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement