ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విద్యార్థులకు ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 23పాఠశాలలకు చెందిన 600మంది విద్యార్థులు హాజరు కాగా, పో లీస్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల విధులు, పనితీరు గురించి వివరించారు. ఆయుధాలు, బాంబులు, దొంగలను పట్టుకునే ఫింగర్‌ప్రింట్స్ యంత్రాలు, పేలుడు పదార్థాలను కనుగొనే పరికరాలు, జాగిలా ల పనితీరు గురించి అవగాహన కల్పించారు. కార్య క్రమంలో అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీలు జీవన్‌రెడ్డి, శ్రీనివాస్, ఇంద్రవర్ధన్, పట్టణ సీఐలు సునీల్‌కుమార్, రాగరాజు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు మురళి, చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.


