జిల్లా వాసికి డాక్టరేట్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌కు చెందిన ఉదారి జ్ఞానేశ్వర్‌చారి విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం నుంచి గురువారం డాక్టరేట్ పట్టా అందుకున్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లోగల బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈయన ఈసీఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ‘డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సీఎంవోఎస్ ఎనలాగ్ ఫ్రొంటెడ్ డిజైన్ ఫర్ లీడ్’ అంశంపై పరిశోధన చేశారు. తక్కువ విద్యుత్ వినియోగంతోగల వైద్య పరికరాలను రూపొందించినందుకు ఈయనకు డాక్టరేట్ పట్టా దక్కింది.


