అమరుల త్యాగాలను స్మరించుకోవాలి
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆదిలాబాద్‌టౌన్: పోలీసు అమరవీరుల త్యాగాల ను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీతోపాటు పోలీస్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం నుంచి ర్యాలీ పట్టణంలోని పలు వీధులగుండా కొనసాగింది. అ దనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీలు జీవన్‌రెడ్డి, శ్రీనివాస్, ఇంద్రవర్ధన్, సీఐలు, ఎస్సైలున్నారు.
కై లాస్‌నగర్: పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం జిల్లా పరి షత్ సమావేశ మందిరంలో పదో తరగతి ఫలితాల పెంపు, విద్యార్థుల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించా రు. విద్యార్థుల హాజరు, ఫలితాల మెరుగుదల, బో ధన నాణ్యత, ఉత్తీర్ణత శాతం పెంపునకు చేపడుతు న్న చర్యలపై సమీక్షించారు. ఆయన మాట్లాడు తూ.. వందశాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో సమ గ్ర ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. గతేడాది ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత శాతం పెంచే దిశగా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉత్సాహం నింపేలా ప్రతీ పాఠశాలలో మోటివేషన్ సెషన్లు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపా రు. ఈ వారంలో ప్రతీ పాఠశాలలో తప్పనిసరిగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని, చదువులో వె నుకబడిన విద్యార్థులకు నవంబర్ 1నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించి జనవరి 10నాటికి సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గ్రాండ్ టెస్ట్–1, గ్రాండ్ టెస్ట్–2 నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలని, ప్రతీ పాఠశాలలో విద్యార్థుల హాజరు వందశాతం నమోదయ్యేలా ఉపాధ్యాయులు, ఎంఈవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో హెచ్‌ఎంలకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఇన్‌చార్జి డీఈవో కుష్బూ గుప్తా, విద్యాశాఖ అధికారులు సుజాత్‌ఖాన్, జగన్, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు పాల్గొన్నారు.
తల్లిదండ్రులూ ఆరోగ్యంగా ఉండాలి
ఇచ్చోడ: పిల్లలతోపాటు తల్లిదండ్రులూ ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. మండలంలోని బోరిగామ జెడ్పీ స్కూల్‌లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని లబ్ధిదారులకు సూచించారు. సీనియర్ సిటిజన్ కాన్ఫిడేషన్, హెల్త్ ఇండియా సౌ జన్యంతో నిర్వహించిన తల్లిదండ్రుల సంక్షేమం–సంరక్షణ అవగాహన కార్యక్రమంలో పాల్గొని వి ద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తాత, ముత్తాతలకు పాదపూజ చేసి ఆశీస్సులు తీసుకున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సి న జాగత్రలపై హెల్త్ ఇండియా స్టేట్ కోఆర్డినేటర్ శ్యామ్ అవగాహన కల్పించారు. 80 ఏళ్లు దాటిన వ యోవృద్ధులను వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లా సంక్షేమాధికారి మిల్కా, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు దేవిదాస్ దేశ్‌పాండే, తహసీల్దార్ జాదవ్ రమేశ్, ఎంపీడీవో ఆ నంద్, ప్రధానోపాధ్యాయుడు రమాకాంత్ ఉన్నారు.
అమరుల త్యాగాలను స్మరించుకోవాలి


