ఆస్పత్రి ప్రసవాలను ప్రోత్సహించాలి
బజార్‌హత్నూర్: మారుమూల గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు ఆస్పత్రి డెలివరీలపై అవగా హన కల్పించి ప్రోత్సహించాలని అడిషనల్ డీ ఎంహెచ్‌వో మనోహర్ సూచించారు. గురువా రం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. రికార్డులు, ప్రసూతి గది, గర్భిణుల వెయిటింగ్ హాల్, ఫార్మా గదిని పరిశీలించారు. ఏఎన్సీ, పీఎన్సీ, ఎన్‌సీడీ స్క్రీనింగ్ వివరాలు, గర్భిణులు, బా లింతలకు అందిస్తున్న 102 అంబులెన్స్ సేవల గురించి తెలుసుకున్నారు. మెడికల్ ఆఫీసర్ శిల్ప, హెచ్‌ఈవో సూర్యప్రకాశ్, రవీందర్, సూపర్‌వైజర్ సుశీల, సిబ్బంది పాల్గొన్నారు.


