
పరిశీలించిన నిపుణుల బృందం..
కూలిన భవనాన్ని హైదరాబాద్‌కు చెందిన ర్యాప్‌కాన్ కన్సల్టెంట్ ప్రతినిధి పి.కామేశ్, ఈఎం సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధి దయాకర్‌రావు, జేఎన్‌టీయూ ప్రొఫెసర్ శ్రీనివాస్‌తో కూడిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ఆర్‌అండ్‌బీ శాఖ ఆదిలాబాద్ ఈఈ నర్సయ్య, డీఈ రమేశ్‌లతో కలిసి పరిశీలించింది. భవనం కూలడానికి కారణమేంటి,నాణ్యత, కూలిన శిథిలాలు తొలగించడమా లేక పూర్తిగా భవనాన్ని నేలమట్టం చేయడ మా అనేదానిపై ఆరా తీసింది. అనంతరం కలెక్టర్‌తో సమావేశమై నివేదిక అందజేశారు. కూలి న విభాగాన్ని మినహాయిస్తే మిగతా భవనాన్ని వాడుకోవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఆర్‌అండ్‌బీ సీఈ భవనాన్ని పరిశీలించా కే తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా వెల్లడించా రు. భవన నాణ్యత పటిష్టత తెలుసుకునేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నామని, నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.