
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
ఇంద్రవెల్లి: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అ న్నారు. ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆస్పత్రి పరిధిలోని ముత్నూర్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సీ జనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆశ కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పద్మ, సముద్ర తదితరులున్నారు.
నార్నూర్ ఆసుపత్రి తనిఖీ..
నార్నూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించా రు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట డీడీవో రాంబాబు, వైద్యులు జితేందర్‌రెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్ చరణ్‌దాస్ తదితరులున్నారు.