ఇప్పటికే మించిన ఏడాది సాధారణ వర్షపాతం
తడిసి ముద్దయిన జిల్లా
నాలుగేళ్లుగా అధిక వర్షాలే..
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఈ ఏడాది వర్షాలు దంచి కొట్టాయి. వానాకాలం ఉండే నాలుగు నెలలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 995.8మి.మీ.లు. అయితే ఈసీజన్ ముగి సేందుకు మరో పక్షం రోజుల గడువు ఉండగా జిల్లాలో ఇప్పటికే 1,215.3 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 33 శాతం అధికం. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రోజూ వ ర్షాలు కురుస్తున్నాయి.ఆగస్టులో భారీవర్షాలను చవి చూసిన జిల్లా సెప్టెంబర్‌లోనూ అదే తీరు కొనసాగుతుంది. ఆగస్టులో ఏకంగా 462 మి.మీ.ల వర్షం కురిసింది. ఇది సాధారణంతో పోల్చితే 56 శాతం అధికం. ప్రస్తుతం సెప్టెంబర్ తొలిపక్ష ంలో ఇప్పటి వరకు 263.8 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. నెలాఖరు వరకు ఎంత కురుస్తుందో చెప్పలేం. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లా తడిసి ము ద్దవుతోంది.వాగులు,వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. భీంపూర్,బేల,ఇంద్రవెల్లి,ఆదిలా బాద్‌రూరల్,ఆదిలాబాద్ అర్బన్, మావల, తాంసి, తలమడుగు, బజార్‌హత్నూర్,సిరికొండ, ఉట్నూ ర్, సాత్నాల, భోరజ్ మండలాల్లో 20 నుంచి 40 శా తం వరకు అధిక వర్షపా తం నమోదైంది. గాది గూడ, నార్నూర్, బోథ్, నేరడిగొండ, సొనా ల మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది.
అత్యధిక వర్షపాతం నమోదైన మండలాలు..(మి.మీ.లలో)
మండలం సాధారణం కురిసింది వ్యత్యాసం(అత్యధికం)
గుడిహత్నూర్ 889.7 1486.6 67శాతం
ఇచ్చోడ 942.8 1542.6 64శాతం
జైనథ్ 937.4 1520.4 62శాతం
సంవత్సరాల వారీగా వర్షపాతం వివరాలు (మి.మీ.లలో)
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు..
సంవత్సరం కురిసిన వర్షం
2021–22 1,481
2022–23 1,481.3
2023–24 1,070
2024–25 1,215.3 (ఈనెల 12 వరకు..)