
మె..‘నో’!
విద్యార్థినులు తినకుండా పక్కన పెట్టిన పులిహోర (ఫైల్)
నార్నూర్‌లోని కేజీబీవీలో ఇటీవల పురుగుల అన్నం పెట్టడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగిన విష యం తెలిసిందే. కాగా, ఇక్కడ పనిచేస్తున్న ప్రత్యేకాధికారి 2022లో ఆదిలాబాద్‌రూరల్ కేజీబీవీలో పనిచేశారు. ఆ సమయంలో ఫుడ్‌పాయిజన్ కావడంతో 105 మంది అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లో ఆమెను ఏడాది పాటు విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆమే ఇక్కడ పనిచేస్తుండగా.. మళ్లీ పురుగుల అన్నం ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఇక నేరడిగొండ కేజీబీవీ, తాంసి మండలంలోని ఘోట్కూరి పాఠశాల, భీంపూర్ కేజీబీవీలోనూ గతంలో ఫుడ్‌పాయిజన్ సంఘటనలు చోటు చేసుకున్నాయి.