
ప్రజా రవాణా సంస్థలను కాపాడాలి
ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా గల ప్రజా రవాణా సంస్థలను కాపాడాలంటూ ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆ ధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ డిపో కార్యదర్శి ఆశన్న మాట్లాడుతూ.. విద్యుత్ బస్సుల విధానంలో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా సంస్థలే ఎలకి్ట్రక్ బస్సులు కొనుగోలు చేసేలా నిధులు సమకూర్చాలన్నారు. ఈమేరకు ఆర్టీసీకి సబ్సిడీ మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో దేవేందర్, వెంకటేశ్, సునీల్, స్వామి తదితరులు పాల్గొన్నారు.