
ప్రతీ దరఖాస్తుపై శ్రద్ధ వహించాలి
కై లాస్‌నగర్: సీఎం పైలట్ ప్రజావాణిలో అందించే ప్రతీ దరఖాస్తును నిర్ణీత గడవులోపు పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్నూర్, ఉట్నూర్, ఆదిలాబాద్ రూరల్, జైన థ్ మండలాలకు సంబంధించిన దరఖాస్తుల అప్పీళ్లపై శుక్రవారం విచారణ నిర్వహించారు. రెవెన్యూశాఖలో 15, వ్యవసాయ శాఖలో 11, మిషన్ భగీరథలో ఐదు, విద్యుత్‌శాఖలో ఐదు, డీఆర్‌డీఏ పింఛన్ కు సంబంధించి 3 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా వాటిపై విచారణ చేపట్టారు. దరఖాస్తుదారులు, ఆయా శాఖల అధికారుల సమక్షంలో పెండింగ్‌కు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారా నికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలస్థాయిలో పరిష్కారం కాని దరఖాస్తులను జిల్లా స్థాయిలో విచారించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పాల్గొన్నారు.
నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలి
అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, క మ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, పాఠశాలల మరుగుదొడ్లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీఎం జన్‌మాన్ కింద 25 చిల్డ్రన్ హోమ్‌లు, 51 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలను ఈజీఎస్ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొ డ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించాలి
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వాటిని పరిరక్షిస్తూ ముందుకెళ్లాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రపంచ ఆదివాసీ ది నోత్సవ ప్రత్యేక సంచికను శుక్రవారం ఆవిష్కరించారు. ఇందులో ఆదివాసీ సంఘం రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి సచిన్, జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, నాగో రావ్, తనుష్, సక్కు తదితరులు పాల్గొన్నారు.