
స్వేచ్ఛను హరించడమే..
ఆదిలాబాద్‌టౌన్: రాజ్యాంగం కల్పించిన హక్కును చంద్రబాబు ప్రభుత్వం కాలరాయడం సరికాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మీడియాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను ప్రచురిస్తే ఎడిటర్‌పై కేసులు పెట్టడం సరికాదు. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి.
– వెంకటేశ్, జేఏసీ కోకన్వీనర్
ఆసిఫాబాద్‌అర్బన్: మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలిగించొద్దు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మీడియాపై అణచివేతకు పాల్పడిన ఘటనలు లేవు. తప్పుడు వార్తలు రాస్తే వివరణ అడగాలి. అంతేగాని దౌర్జన్యానికి దిగడం సరికాదు. మీడియాకు స్వేచ్ఛకు భంగం కలిగించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. సాక్షి పత్రిక ఎడిటర్‌పై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. – రాపర్తి రవీందర్, ఆసిఫాబాద్ బార్
అసోసియేషన్ అధ్యక్షుడు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే..

స్వేచ్ఛను హరించడమే..