
గణపతికి కలెక్టర్, ఎస్పీ పూజలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామన్స్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతి ష్ఠించిన వినాయకునికి శుక్రవారం కలెక్టర్ రా జర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూ జలు నిర్వహించారు. నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించా రు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య కూడా గణేశుడిని దర్శించుకుని పూజలు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు గంట వినోద్, ప్రతినిధులు దత్తాత్రి, రవి, సారంగపాణి, విఠల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.