
‘పోక్సో’పై అవగాహన అవసరం
ఆదిలాబాద్‌టౌన్: పోక్సో చట్టంపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా జడ్జి ప్రభాకరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోక్సో చట్టంతో పాటు బాలల హక్కులపై ఉపాధ్యాయులు, లెక్చరర్లకు మంగళవారం ఓరియంటేషన్ నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2012లో పోక్సో చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. నేర ని రూపణ అయితే నిందితుడికి మూడేళ్ల జైలుతో పాటు ఉరి శిక్ష సైతం విధించే అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ పి ల్లలకు విద్యా సంస్థల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, యూనిసెఫ్ రిసోర్స్ పర్సన్ డేవిడ్, కామారెడ్డి డీసీపీవో స్రవంతి, డీఐఈవో గణేశ్, జిల్లా సంక్షేమ అధి కారి మిల్కా, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి తిరుపతి, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.