● నిండిన ప్రాజెక్టులు, చెరువులు ● ఆగస్టులో అధిక వర్షపాతం ● ఏకంగా 56 శాతం అధికం | - | Sakshi
Sakshi News home page

● నిండిన ప్రాజెక్టులు, చెరువులు ● ఆగస్టులో అధిక వర్షపాతం ● ఏకంగా 56 శాతం అధికం

Sep 3 2025 4:17 AM | Updated on Sep 3 2025 4:17 AM

● నిం

● నిండిన ప్రాజెక్టులు, చెరువులు ● ఆగస్టులో అధిక వర్షపాత

● నిండిన ప్రాజెక్టులు, చెరువులు ● ఆగస్టులో అధిక వర్షపాతం ● ఏకంగా 56 శాతం అధికం

(మి.మీ.లలో) (మి.మీ.లలో)

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాలో గడిచిన నెలలో వర్షాలు దంచి కొట్టాయి. ఆగస్టులో ఏకంగా 56 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌, జూలై వరకు సాధారణానికే పరిమితమైన విషయం విదితమే. గడిచిన నెలలో కురిసిన వర్షాలతో ప్రస్తుతం జిల్లా వర్షపా తం ఏకంగా అధిక స్థితికి చేరువైంది. జిల్లా వార్షిక వర్షపాతం 1154.9 మి.మీ.లు. వానాకాలం వరకు 995.8 మి.మీ.లు సాధారణ వర్షపాతం. అయితే ఇప్పటివరకు 23 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులు తుండడంతో జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నా యి. సెప్టెంబర్‌లోనూ ఇదే కొనసాగితే వర్షపాతం అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు.

12 మండలాల్లో అధికం..

ఆగస్టులో కురిసిన వర్షాలతో జిల్లాలో వర్షపాతం గ ణనీయంగా పెరిగింది. 12 మండలాల్లో అధికంగా, తొమ్మిది మండలాల్లో సాధారణ స్థితి నమోదైంది. ఇదిలా ఉంటే ఆగస్టు మూడో వారం నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరుణుడు ఇక శాంతించాలని రైతులు కోరుకుంటున్నారు.

ప్రాజెక్టులు, చెరువులకు జల కళ

జూలై చివరి వరకు సాధారణ వర్షపాతం ఉండడంతో జలాశయాలు పూర్తిస్థాయిలో నిండలేదు. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని రెండు ప్రా జెక్టులు సాత్నాల, మత్తడి వాగు నిండు కుండలా తయారయ్యా యి. ఆయా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జిల్లాలోని సుమారు 300 చెరువులు పూర్తిగా నిండాయి. పలుచోట్ల అలుగు పారాయి. భూగర్భ జలాలు సైతం గణనీయంగా పెరిగాయి.

మండలాల వారీగా.. (జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 2వరకు)

మండలం సాధారణం కురిసింది స్థితి

భీంపూర్‌ 732.1 871.4 సాధారణం

జైనథ్‌ 869.6 1251.3 అధికం

బేల 840.7 1063.8 అధికం

గాదిగూడ 829.0 790.5 సాధారణం

నార్నూర్‌ 852.4 964.3 సాధారణం

ఇంద్రవెల్లి 977.5 1157.7 సాధారణం

గుడిహత్నూర్‌ 832.1 1299.0 అధికం

ఆదిలాబాద్‌రూరల్‌ 865.6 1072.3 అధికం

ఆదిలాబాద్‌అర్బన్‌ 849.6 1116.3 అధికం

మావల 823.9 1079.5 అధికం

తాంసి 786.3 983.4 అధికం

తలమడుగు 789.3 974.1 అధికం

బజార్‌హత్నూర్‌ 864.9 1120.2 అధికం

బోథ్‌ 815.7 837.8 సాధారణం

నేరడిగొండ 817.0 837.8 సాధారణం

ఇచ్చోడ 874.5 1369.7 అధికం

సిరికొండ 909.4 1164.5 అధికం

ఉట్నూర్‌ 925.4 1038.5 సాధారణం

సొనాల 815.7 767.8 సాధారణం

సాత్నాల 858.2 1139.4 అధికం

భోరజ్‌ 868.0 1001.4 సాధారణం

అలుగు పారుతున్న కరత్వాడ చెరువు

నెలల వారీగా (మి.మీ.లలో)

నెల సాధారణం కురిసింది వ్యత్యాసం స్థితి

జూన్‌ 209.4 215 3 శాతం అధికం సాధారణం

జూలై 323.3 274.5 –15 శాతం తక్కువ సాధారణం

ఆగస్టు 295.3 462 56 శాతం అధికం అధికం

సెప్టెంబర్‌ 167.8 –– –– ––

● నిండిన ప్రాజెక్టులు, చెరువులు ● ఆగస్టులో అధిక వర్షపాత1
1/2

● నిండిన ప్రాజెక్టులు, చెరువులు ● ఆగస్టులో అధిక వర్షపాత

● నిండిన ప్రాజెక్టులు, చెరువులు ● ఆగస్టులో అధిక వర్షపాత2
2/2

● నిండిన ప్రాజెక్టులు, చెరువులు ● ఆగస్టులో అధిక వర్షపాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement