పల్లె ఓటర్లు @ 4,49,981 | - | Sakshi
Sakshi News home page

పల్లె ఓటర్లు @ 4,49,981

Sep 3 2025 4:17 AM | Updated on Sep 3 2025 4:17 AM

పల్లె ఓటర్లు @ 4,49,981

పల్లె ఓటర్లు @ 4,49,981

● పంచాయతీ తుది జాబితా విడుదల ● పురుషులతో పోల్చితే మహిళలే అధికం

కై లాస్‌నగర్‌: పల్లెపోరుకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. త్వరలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సంబంధిత ఓటరు జాబితా ప్రక్షాళనకు ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన వారిని చేర్చడంతో పాటు వార్డులు, గ్రామాల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేలా చూడాలని ఆదేశించింది. తదనుగుణంగా కసరత్తు చేసిన అధికారులు తుది జా బితా ఖరారు చేశారు. జిల్లావ్యాప్తంగా 4,49,981 మంది పల్లె ఓట ర్లున్నట్లు గుర్తించారు. ఇందులో పురుషులు 2,19,652 మంది, మ హిళలు 2,30,313 మంది ఉన్నా రు. ఇతరులు మరో 16 మంది ఉ న్నారు. ఈ జాబితా ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు ఉంటా యని అధికారులు స్పష్టం చేశారు.

మహిళా ఓటర్లే అధికం..

జిల్లాలో 20 గ్రామీణ మండలాలు ఉండగా వాటి పరిధిలో 473 గ్రామ పంచాయతీలున్నాయి. ఓటర్ల తుది జాబితా తయారీకి ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులపై అభ్యంతరాలను స్వీకరించింది. కొత్తగా కేవలం రెండు ఓట్లు నమోదు కాగా మార్పులు, చేర్పులపై 1400 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 10,661 మంది అధికంగా ఉన్నారు. వీరే పంచాయతీ పోరులో నిలిచే అభ్యర్థుల తలరాతను మార్చనున్నారు.

మండలాల వారీగా పంచాయతీ ఓటర్ల వివరాలు

మండలం పురుషులు మహిళలు ఇతరులు

ఆదిలాబాద్‌రూరల్‌ 13,858 14,674 00

బజార్‌హత్నూర్‌ 11,687 12,141 01

బేల 13,825 13,762 00

భీంపూర్‌ 9,312 10,166 00

భోరజ్‌ 7,302 7,656 00

బోథ్‌ 13,022 14,236 01

ఇచ్చోడ 17,131 18,114 00

గాదిగూడ 7,695 8,104 00

గుడిహత్నూర్‌ 12,361 12,929 00

ఇంద్రవెల్లి 16,033 16,416 03

జైనథ్‌ 9,741 10,253 00

మావల 2,103 2,283 00

నార్నూర్‌ 11,606 11,775 04

నేరడిగొండ 11,517 12,352 00

సాత్నాల 5,241 5,421 00

సిరికొండ 6,431 6,714 00

సొనాల 5,293 5,511 00

తలమడుగు 13,481 14,376 00

తాంసి 6,515 7,267 00

ఉట్నూర్‌ 25,472 26163 07

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement