
నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా చర్యలు
కై లాస్‌నగర్/సాత్నాల: ఈనెల 4, 6 తేదీల్లో నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి శోభాయాత్ర కొనసాగే మార్గాల ను మంగళవారం పరిశీలించారు. పట్టణంలోని ప్ర ధాన చౌక్‌లతో పాటు భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే భోరజ్ మండలం పెన్‌గంగ వరకు గల మార్గాన్ని పరిశీలించి ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ఘాట్ల వద్ద శుభ్రత, వాహనాల రాకపోకలపై అధికారుల కు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టణంలో రోడ్లు గుంతలమయమైన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్లకు ఇరువైపులా అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను సవరించాలన్నారు.పెన్‌గంగ బ్రిడ్జ వద్ద సరిపడా క్రేన్లు, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు గజ ఈతగాళ్లు, అంబు లెన్స్ అందుబాటులో ఉంచాలని సంబంధిత అధి కారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. వారి వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీ ఎన్. రాజు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ జేఆర్ చౌహాన్, తహసీల్దార్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
గణనాథుడికి ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రతిష్టించిన గణనాథునికి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో సెకండ్ బెటాలియన్ కమాండెంట్ నీతిక పంత్, డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.