
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
ఉట్నూర్‌రూరల్: పేదల పెన్నిధి, సంక్షేమ పథకాల ప్రదాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో అందించిన సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. వైఎస్సార్ వర్ధంతిని ఉట్నూర్‌లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహానేత చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. పేదల కోసం ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన మహానేత అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సునిల్ జాదవ్, మాజీ సర్పంచ్ ప్రతిభ, విశాల్, గోవింద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.