
స్థల వివాదంలో ఒకరికి కత్తిపోట్లు
సోన్: స్థల వివాదంలో ఒకరిని కత్తితో పొడిచిన సంఘటన మండలంలోని న్యూబొప్పారంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వేముల శ్రీనావాస్ తన ప్లాటును అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తికి విక్రయించాడు. తనను కాదని ఎలా అమ్ముతావని వరుసకు మేనమామ అయిన కనికరం చిన్నయ్య అడిగే క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో చిన్నయ్య శ్రీనివాస్‌పై కారంపొడి చల్లి కత్తితో పొడిచాడు. శ్రీనివాస్ కోపంతో చిన్నయ్య తలపై కర్రతో కొట్టడంతో గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఇద్దర్ని వేరువేరుగా అంబులెన్స్‌లో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గోపి తెలిపారు.

స్థల వివాదంలో ఒకరికి కత్తిపోట్లు