
ఆర్డీవో వినోద్‌కుమార్‌కు ఆత్మీయ వీడ్కోలు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ ఆర్డీవో బి.వినోద్‌కుమార్ శనివారం తన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో విధుల్లో చేరిన ఆయనను రాష్ట్ర ఎన్నికల సంఘానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నిజా మాబాద్ బీసీ సంక్షేమాధికారి స్రవంతిని నియమించింది. దీంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. కాగా విధుల నుంచి రిలీవ్ అయిన ఆర్డీ వోకు శనివారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా తదితరులు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు. ఇందులో కలెక్టరేట్ ఏవో వర్ణ, తహసీల్దార్లు,ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.