
అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్
జైనథ్ : అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరె స్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బేల మండలానికి చెందిన సుమిత్, అతని మిత్రుడైన సలీం షకిల్‌తో కలసి మహారాష్ట్రకు చెందిన కృష్ణతో గ్యాంగ్‌గా ఏర్పడ్డారన్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్, బేల, మహారాష్ట్ర కోర్పణ మండలాల్లో బైక్‌లను అపహరించి ఇతరులకు విక్రయిస్తుండేవారన్నారు. వారి వద్దనుంచి 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఎనిమిదిమందిపై కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్‌కు తరలించామన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
కోటపల్లి: మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. కోటపల్లి మండలంలోని రాంపూర్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. డ్రైవర్ సంజయ్‌ను అదుపులోకి తీసుకుని సివిల్ సప్‌లై అధికారులకు సమాచారం అందించమన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
రెండోలీగ్‌లో ఓడిన ఉమ్మడి జిల్లా జట్టు
మంచిర్యాలటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎ స్సార్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో రెండో లీగ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు సాయి సత్య టీంతో 90 ఓవర్ల చాంపియన్‌షిప్‌లో ఓడిపోయింది. ఆదిలాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 30.3 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌట్ కాగా అనంతరం బ్యాటింగ్ చేసిన సాయిసత్య టీం 24.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టులోని సాయికుమార్ 7 వికెట్లు సాధించడం గమనార్హం. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో, ఇరుజట్లు పరుగులను చేసేందుకు ఇబ్బంది పడ్డాయని కోచ్ ప్రదీప్ తెలిపారు.
దివ్యాంగులకు రైలులో
రాయితీపై ప్రయాణం
మంచిర్యాలఅర్బన్: దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి రైల్వేశాఖ రాయితీపై ప్ర యాణ సౌకర్యం కల్పిస్తోందని సికింద్రాబాద్ డివిజన్ (ఎస్‌సీఆర్) అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఐఎస్‌ఆర్ మూర్తి అన్నారు. గురువా రం మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో అవగాహన కల్పించారు. మంచిర్యాల కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్