
‘రేషన్’ మంజూరు పత్రాలొచ్చాయ్●
కై లాస్‌నగర్: కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి కి సంబంధించిన రేషన్‌కార్డుల మంజూరు ప త్రాలు బుధవారం జిల్లాకు చేరాయి. జిల్లాలోని 21 మండలాల పరిధిలో కొత్త కార్డులు 4,900 మంజూరయ్యాయి. అలాగే పాత కార్డుల్లో కొత్తగా 5,160 మందిని చేర్చారు. వారికి సంబంధించిన మంజూరుపత్రాలు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి చేరాయి. వాటిని నియోజకవర్గం, మండలాల వారీగా సిద్ధం చేసిన అధికారులు ఆయా మండలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి పంపిణీ ప్రక్రియను ఈ నెల 22లోపు పూర్తి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం మండలాల వారీగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వాటిని లబ్ధి దారులకు అందజేయనున్నట్లు డీఎస్‌వో వాజీ ద్ అలీ తెలిపారు. రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, మంజూరుపత్రాలు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.