
ఘనంగా క్వారీ దుర్గాదేవి జాతర
క్వారీ దుర్గాదేవి 54వ వార్షికోత్సవ జాతరకు భక్తులు వేలసంఖ్యలో హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గఢ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధి ఎంసీసీ క్వారీలో ఏటా జరిగే ఈ జాతర అంగరంగ వైభవంగా సాగింది. ఆదివారం ఉదయం ఆలయ ఆవరణలో వేదమంత్రోచ్ఛారణల మధ్య చండీహామం జరిపారు. భక్తులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో వాహనాలకు పూజలు జరుపుకున్న భక్తులు కోళ్లు, మేకలు బలిచ్చి అక్కడే వంటలు చేసుకున్నారు. దుర్గాదేవి దర్శన అనంతరం ఆలయ ఆవరణలోని పోచమ్మ, నాగదేవతలను కూడా దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు –రాజకుమారి దంపతులు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో ఏసీపీ ప్రకాశ్ పర్యవేక్షణలో మంచిర్యాల సీఐ ప్రమోద్, పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. – మంచిర్యాలరూరల్ (హాజీపూర్)

ఘనంగా క్వారీ దుర్గాదేవి జాతర

ఘనంగా క్వారీ దుర్గాదేవి జాతర

ఘనంగా క్వారీ దుర్గాదేవి జాతర