
అపూర్వ కలయిక!
బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1981 –82లో పదో తరగతి, 1982 –84లో ఇంటర్ చదివిన పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరిన అపూర్వ ఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. అపూర్వ సమ్మేళనంలో ఆనాటి విద్యార్థులు తమ విద్యాభ్యాసం రోజుల జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువులు నర్సింగ్‌రెడ్డి, నర్సారెడ్డి, రమేశ్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. భూమారెడ్డి, విజయ్, కాశీనాథ్, రమాకాంత్, దేవిదాస్, సదానందం, రమేశ్, విలాస్, సునీల్, అనురాధ, పద్మ, సునీత, ఎస్‌ఎస్ ఖాన్, మహేంద్ర, శివాజీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. – బోథ్
50 ఏళ్ల తర్వాత..
బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అట్ట హాసంగా జరిగింది. 1974 –75లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి భావోద్వేగానికి గురయ్యారు. విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు పూలమాల వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు జి.వెంకటయ్య, మాధవి, ఉపాధ్యాయులు శ్రీహరి, కృష్ణారావు, సతీశ్, జగన్నాథరావు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. – బెల్లంపల్లి

అపూర్వ కలయిక!