
రోడ్డు ప్రమాదం.. కుటుంబం చిన్నాభిన్నం
కాసిపేట/లక్సెట్టిపేట: రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కుటుంబంలోని తండ్రి, పెద్ద కుమారుడు మృతి చెందగా, తల్లి, చిన్నకుమారుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హృదయ విషాదకర ఘటన శనివారం చోటు చేసుకుంది. లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. దండెపల్లి మండలం నెల్కివెంకటాపూర్ గ్రామం వందూర్‌గూడ తండాకు చెందిన సిడం శంకర్(37) దేవాపూర్‌లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీ న్యూప్లాంట్‌లో లోడింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం తన తండ్రి దామును చూసేందుకు భార్య సుమిత్ర, ఇద్దరు కుమారులు సాగర్(13), సంతోష్‌లతో కలిసి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా లక్సెట్టిపేట మండలం అంకతిపల్లి స్టేజీ సమీపంలో మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపునకు వస్తున్న కారు బైక్‌ను ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో పెద్ద కుమారుడు సాగర్ అక్కడికక్కడే మృతి చెందగా శంకర్, సుమిత్ర, సంతోష్‌లకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులకు మంచిర్యాలలో చికిత్స అందించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో శంకర్ మృతిచెందగా భార్య, చిన్న కుమారుడు కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి తమ్ముడు సిడం జాకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
తండ్రి, పెద్ద కుమారుడు మృతి
తల్లి, చిన్న కుమారుడికి
తీవ్ర గాయాలు
దేవాపూర్‌లో విషాదచాయలు

రోడ్డు ప్రమాదం.. కుటుంబం చిన్నాభిన్నం

రోడ్డు ప్రమాదం.. కుటుంబం చిన్నాభిన్నం