
‘సాహితీ విపంచి’ ఆవిష్కరణ
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో జిల్లా సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం సాహితీ విపంచి సంపుటి–6ను కవి అన్వర్ అవిష్కరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 125 మంది కవులు రంచించిన సంపుటి పద్యవిభాగంలో 25 గేయ విభాగంలో 77 కవితలు రాయటం జరిగింది. ఈసందర్భంగా అన్వర్ మాట్లాడుతూ సాహితీ సంస్థ ఏర్పాటు చేసి 17 సంవత్సరాలుగా ప్రతీ మాసంలో రెండు సాహితీ కార్యక్రమాలు నిర్వహించటం గొప్ప విషయమన్నారు. కవులు మలయశ్రీ, ఐవీ సుబ్బాయమ్మ, సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు అనంద్‌రావు, మహిళా కార్యదర్శి శ్రీలక్ష్మీ, శ్రీనాథ్‌గౌడ్ సాహితీ విపంచి పుస్తక సమీక్షించారు. ఈసందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన కవులను శాలువాలతో సత్కరించి సాహితీ విపంచి సంపుటిని అందజేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు పట్వర్థన్, అధ్యక్షుడు వామన్‌రావు, కవులు చంద్రశేఖర్, బ్రహ్మయ్య, సంతోష్ పాల్గొన్నారు.