
నిబంధనలకు విరుద్ధంగా వైద్యంచేస్తే చర్యలు
బోథ్: నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి నరే ందర్ రాథోడ్ అన్నారు. శనివారం మండలంలోని పొచ్చర సబ్‌సెంటర్‌ను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో నిబంధనల కు విరుద్ధంగా నడుస్తున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌ను గుర్తించి సీజ్ చేశారు. అక్కడ నిర్వహిస్తున్న వైద్యం అర్హతకు మించి ఉందని, ప్రజల ప్రాణా లకు ప్రమాదమన్నారు. ఆర్‌ఎంపీలకు కేవలం ప్రాథమిక చికిత్సకు మాత్రమే అనుమతులు న్నాయని, డాక్టర్ అనిపించుకునే హక్కు లేదన్నారు. ప్రజలు అర్హత గల ఎంబీబీఎస్ వైద్యు ల వద్దే వైద్యం చేయించుకోవాలన్నారు. ఆయ న వెంట మలేరియా అధికారి డాక్టర్ ఎం.శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ రెడ్డి ఉన్నారు.