
ఆదివాసీలకు ప్రత్యేక కాలం కేటాయించాలి
ఆదిలాబాద్‌అర్బన్: జనగణనలో ఆదివాసీలకు ప్రత్యేక కాలం కేటాయించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో ఆదివాసీ అధికార్ రాష్టీయ్ర మంచ్ జాతీయ సమావేశాలకు తెలంగాణ నుంచి హాజరయ్యారు. ఆదివాసీలు ఆస్తిత్వ, సంప్రదాయం, గోండి ధర్మ, ప్రకృతి ఆరాధకులుగా ఉన్న వారికి జనగణనలో పత్యేక మతానికి సంబంధించి కాలం కేటాయించకుండా అన్యా యం చేశారని ఆరోపించారు. కుమురం భీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫార్డెస్ పేరిట తీసుకొచ్చిన జీవో 49 రద్దు చేయాలన్నారు. అటవీ సంపద కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.