
పట్టణంలో కేంద్ర బృందం పర్యటన
కై లాస్‌నగర్: మున్సిపాలిటీల అభివృద్ధితో పాటు ఆదాయ వనరులను పెంపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీం’ కింద ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎంపికై న విషయం తెలిసిందే. పథకం కింద టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా మున్సిపాలిటీకి రూ.900 కోట్ల నిధులు కేటాయించనున్నారు. ఈ నిధులతో పట్టణంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టవ చ్చు, పట్టణ ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చని అధ్యయనం చేసేందుకు అశి పౌల్, ఎన్.వినయ్‌కాంత్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల బృందం శనివారం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పర్యటించింది. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు, వాకింగ్ ట్రాక్ వంటి ఇతరాత్ర వసతులను కల్పించేందుకు వీలుగా పట్టణంలోని పాత జాతీయ రహదారితో పాటు ప్రధాన చౌక్‌లు, ఖానాపూర్ చెరువు, ఇంటిగ్రేటేడ్ మార్కెట్, గాంధీ పార్కు, నేతాజీచౌక్, ఖుర్షీద్‌నగర్‌లోని మున్సిపల్ లీజు స్థలాలను పరి శీలించారు. అంతకు ముందు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును కలిసి పట్టణంలోని వార్డులు, జనా భా, ప్రాపర్టీ ట్యాక్స్, ఇతర మార్గాల్లో వచ్చే ఆదా యం వంటి సమగ్ర సమాచారం సేకరించారు. నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు అందించనున్నా రు. కార్యక్రమంలో ఎంఈ పేరిరాజు, డీఈ కార్తీక్, టౌన్ ప్లానింగ్ అధికారులు సుమలత, నవీన్ కుమార్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం.నరేందర్ పాల్గొన్నారు.