
కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్‌అర్బన్: ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఔట్ సోర్సింగ్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీను అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు శనివారం ఉదయం సంఘం నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలని, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ఉద్యోగి మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెళ్లిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామగిరి సంతోష్, పుల్లూరి రవి, దాసు జ్ఞానేందర్, తోట రాజు, శైలేందర్, రవికిరణ్ యాదవ్, రాహుల్, విజయ్, ఓంకార్, సాయి కృష్ణ, సాయి, ఆశీష్, వేణు, అక్షయ్, శ్రీనివాస్, పవన్, తదితరులు ఉన్నారు.