
పూలే దంపతుల స్ఫూర్తితో రాణించాలి
ఆదిలాబాద్‌రూరల్: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల స్ఫూర్తితో విద్యార్థులు చదువులో రాణించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల పూలే విశ్రాంతి భవనంలో పదోతరగతిలో టాపర్స్‌గా నిలిచిన మాలీ సామాజిక వర్గానికి చెందిన తాంసి మండలం కప్పర్ల హై స్కూల్ విద్యార్థి దారట్ల కీర్తిలయ, తలమడుగు మండలం కుచాలాపూర్‌కు చెందిన సెండే సమీక్షను సత్కరించి నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ గురునులే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శేండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునులే, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ ఉమేష్ రావు డోలే, మాలీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అంబేకర్, పట్టణ అధ్యక్షుడు శ్రీను ఆచారి, తదితరులు పాల్గొన్నారు.